PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 3:08 pm Posted by : Praja Sankshemam News

నల్లగొండలో గాంధీజీకి ఘన నివాళులు..

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్, కలెక్టర్ మరియు ఎస్సీ
గాంధీజీ ఆశయాలను స్మరించుకున్న నాయకులు,ప్రజలు
అహింస,సత్యం,శాంతి మార్గంలో పయనించాలని పిలుపు

నల్లగొండ:జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.గాంధీజీ చూపిన సత్యం,అహింస, శాంతి,సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.దేశ ఐక్యత,సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.