నల్లగొండ అభివృద్ధికి రూ.197.44 కోట్ల నిధులు మంజూరు:
ప్రపంచ బ్యాంకు సహకారంతో పట్టణాభివృద్ధికి భారీ ప్రణాళిక.. ఆధునిక హంగులతో గడియారం సెంటర్ ప్రజా సంక్షేమం న్యూస్ | నల్లగొండ ప్రతినిధి: నల్లగొండ నగర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పరిధిలో తెలంగాణ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రామ్ (TUTJP) కింద ప్రపంచ బ్యాంకు సహకారంతో నల్లగొండ పట్టణ అభివృద్ధికి రూ.197.44 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయి.ఈ ప్రాజెక్టు వ్యయంలో ప్రపంచ బ్యాంకు 70 శాతం వాటాగా రూ.138.21 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30...