నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కొల్లి సత్యనారాయణ

పీడీఎఫ్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన.. ప్రజా సంఘాల మద్దతు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఉమ్మడి అభ్యర్థిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణను ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అభ్యర్థి ప్రకటన, పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ డబ్బు, మద్యానికి అతీతంగా...