PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:00 pm Posted by : Praja Sankshemam News

నాచారంలో రూ.44 కోట్లతో ఆలయ రహదారి పనులకు శంకుస్థాపన

**ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు.. రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు**
ప్రజాసంక్షేమం న్యూస్ ఖమ్మం జిల్లా,వైరా:
నాచారంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని,భక్తుల సౌకర్యార్థం రూ.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.గత పాలకుల నుంచి సంక్రమించిన రుణాలపై నెలకు రూ.6,600 కోట్ల భారం ఉన్నప్పటికీ,ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు.పేదలకు ఉచిత వైద్యం,ఉచిత విద్యుత్,సన్నబియ్యం పంపిణీ,ఇందిరమ్మ ఇళ్ల పథకం,యంగ్ ఇండియా పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.