నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రంగస్థల కళాకారుడు నానా పటేకర్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.హిందీ, మరాఠీ చిత్రాల్లో నానా పటేకర్ తన విలక్షణమైన నటన, శక్తివంతమైన సంభాషణా శైలి, సహజమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రంగస్థల కళాకారుడిగా కూడా భారతీయ కళారంగానికి ఆయన విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు.నానా పటేకర్ మృతితో భారతీయ సినీ ప్రపంచం ఒక విలక్షణమైన ప్రతిభను...