PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 5:09 pm Posted by : Praja Sankshemam News

నార్కట్‌పల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష.

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం
ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేయాలి: ఎమ్మెల్యే
ప్రజాసంక్షేమం న్యూస్ నార్కట్‌పల్లి:
నార్కట్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సమావేశంలో మండలంలోని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.