నిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
ఎనిమిదేళ్ల తర్వాత పత్రాలు.. సిలిండర్, స్టవ్ ఏవంటూ లబ్ధిదారురాలి ప్రశ్న ప్రజాసంక్షేమం న్యూస్ నాగార్జునసాగర్: పేద మహిళలకు అందాల్సిన ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ప్రయోజనాలు తనకు అందలేదంటూ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీకి చెందిన మహిళా సంఘ సభ్యురాలు ఆత్మకూరు సుప్రతిక ఆరోపించారు.2018లో ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం రెండుసార్లు దరఖాస్తు చేసినప్పటికీ తనకు కనెక్షన్ రాలేదని, తాజాగా తన పేరుపై ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు ఏజెన్సీ సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత పత్రాలు అందజేస్తూ, సిలిండర్, గ్యాస్ స్టవ్...