పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేటలో ఓటరు నమోదు సహాయ కేంద్రం పరిశీలన ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట:నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు.రామన్నపేటలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు సహాయ కేంద్రాన్ని ఆయన సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు నమోదైన పట్టభద్రుల సంఖ్య, దరఖాస్తు ఫారాల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.అర్హులైన పట్టభద్రుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి...