పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేయాలి:కలెక్టర్ బి.చంద్రశేఖర్
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:2026–27 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మార్కెటింగ్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి మద్దతు ధర, కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సుమారు 5,93,795 ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, దాదాపు 3,56,257 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్‌కు...