PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 4:35 pm Posted by : Praja Sankshemam News

పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల చెక్‌డ్యామ్ ప్రారంబించిన మంత్రి పొంగులేటి!

ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి నిల్వకు కీలక అడుగు
భూగర్భ జలమట్టాలు పెరగడంతో రైతులకు ప్రయోజనం
కట్టుకాచారం, కొత్తగూడెం పరిసర గ్రామాలకు సాగునీటి భరోసా
ప్రజాసంక్షేమం న్యూస్ పాలేరు
: పాలేరు నియోజకవర్గ రైతులకు ప్రయోజనం చేకూర్చే కీలక సాగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. గారితో కలిసి కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించారు.చెక్‌డ్యామ్ నిర్మాణంతో పాలేరు వాగులో నీటిని నిల్వ చేయడంతో పాటు కట్టుకాచారం, కొత్తగూడెం, పరిసర గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా సాగునీటి లభ్యత మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరనుంది.ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తవడం ఈ ప్రాంతానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వాగులో నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాల పరిరక్షణకు కూడా ఇది దోహదపడనుంది.చెక్‌డ్యామ్ వద్ద నీరు నిండుగా నిలిచిన దృశ్యాలను చూసి స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు సాగునీటి భద్రత, భూగర్భ జలాల పెంపుదల దిశగా ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.