పెండింగ్ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.. నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి

హాలియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్** అక్టోబర్ 30, ప్రజా సంక్షేమం న్యూస్, హాలియా: నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, సీసీ కెమెరాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పక్కా ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని...