**నకిరేకల్, (ప్రజా సంక్షేమం న్యూస్):** ఆర్థిక ఇబ్బందులతో కళాశాల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బీటెక్ విద్యార్థికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అండగా నిలిచారు.రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామానికి చెందిన వరకాల సాయి సిద్ధార్థకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.గండిమైసమ్మలోని హితం కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న సాయి సిద్ధార్థ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, విద్యార్థిని తన నివాసానికి పిలిపించి రూ.1,00,000 అందించారు.ఈ సందర్భంగా సాయి సిద్ధార్థ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.ఆపదలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు విద్యార్థి సాయి సిద్ధార్థతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.