పేద విద్యార్థికి ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.లక్ష ఆర్థిక సాయం
**నకిరేకల్, (ప్రజా సంక్షేమం న్యూస్):** ఆర్థిక ఇబ్బందులతో కళాశాల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బీటెక్ విద్యార్థికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అండగా నిలిచారు.రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామానికి చెందిన వరకాల సాయి సిద్ధార్థకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.గండిమైసమ్మలోని హితం కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న సాయి సిద్ధార్థ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, విద్యార్థిని తన నివాసానికి పిలిపించి రూ.1,00,000 అందించారు.ఈ సందర్భంగా సాయి...