పోలీస్ టీ20 టోర్నీ ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

35 పోలీసు జట్లు పాల్గొనే అవకాశం.. పర్యవేక్షణకు 10 ప్రత్యేక కమిటీలు** ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:3వ అఖిల భారత పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026–27 నిర్వహణకు సంబంధించి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోలీసుల ఆతిథ్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరగనున్న ఈ జాతీయ స్థాయి టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.టోర్నీకి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు...