చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, అక్టోబర్ 8 (ప్రజా సంక్షేమం న్యూస్):
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.9వ పోషణ మాసం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బ్లాంకెట్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యకరమైన బాల్యం.. ఆరోగ్యకరమైన కుటుంబం.. ఆరోగ్యవంతమైన సమాజం అనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సీడీపీఓ సుబ్బలక్ష్మి, కౌన్సిలర్లు జహీర్, తాహెర్, అంజలి, వీరమ్మ, నాగమ్మ, కళావతి, జ్యోతి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.