PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 9:37 am Posted by : Praja Sankshemam News

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలిప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తున్న జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
జనవిజ్ఞాన వేదిక సభ్యత్వం స్వీకరణ:నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి గంగాధర్ భద్రయ్య ఎమ్మెల్యే వేముల వీరేశానికి సంస్థ సభ్యత్వాన్ని అందజేశారు. సభ్యత్వ రశీదును కూడా అందించారు.
మూఢనమ్మకాల నిర్మూలనకు కృషిఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, మూఢనమ్మకాలను తొలగించడం కోసం చేస్తున్న కృషిని వివరించారు.
శాస్త్రీయ ఆలోచనలతోనే సమాజాభివృద్ధి:ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. శాస్త్రీయ దృక్పథంతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.