వీవోఏపై కులం పేరుతో దూషించి దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి !
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలి వీవోఏలపై వేధింపులు, దాడులు అరికట్టాలి న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన: సంఘం నాయకుల హెచ్చరిక నల్లగొండ, అక్టోబర్ 3: చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామంలో ఐకేపీ వీవోఏగా పనిచేస్తున్న గనిపెళ్లి మాధవిని కులం పేరుతో దూషించి దాడి చేసిన మాజీ సర్పంచ్ భర్త కుప్పల అమర్నాథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐకేపీ వీవోఏల సంఘం (సీఐటీయూ) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.ఈ మేరకు జిల్లా గౌరవాధ్యక్షులు...