PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 4:12 pm Posted by : Praja Sankshemam News

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండు డీఏలకు ఉత్తర్వులు జారీ

ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. 2024 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీఏ ఎంత పెరిగింది:2016 పే స్కేల్ ఉద్యోగులకు జనవరి 2024 డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి, జూలై 2024 డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను వరుసగా 230 నుంచి 239 శాతం, 239 నుంచి 246 శాతానికి పెంచారు.
పెంచిన డీఏ ఎప్పటి నుంచి చెల్లిస్తారు:పెంచిన డీఏను అక్టోబర్ 2026 నెల జీతంతో కలిపి నవంబర్ 1, 2026న ఉద్యోగులకు చెల్లించనున్నారు.
బకాయిలు ఎలా చెల్లిస్తారు:జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న బకాయిలను 33 వాయిదాల్లో, జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నారు. బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.