PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 8:14 pm Posted by : Praja Sankshemam News

బెట్టింగ్ యాప్‌ల వ్యసనానికి యువకుడు బలి.. అప్పుల బాధతో ఆత్మహత్య

ప్రజాసంక్షేమం న్యూస్|భువనగిరి:
బెట్టింగ్ యాప్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయిన ఓ యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది.బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోయి అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న యువకుడు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. మృతికి ముందు తన భార్యకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. “నన్ను క్షమించు.. ఎన్నిసార్లు మారాలనుకున్నా మారలేకపోయాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం” అంటూ తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేసినట్లు సమాచారం.అలాగే భార్య, కుమార్తెకు క్షమాపణలు చెబుతూ.. “నీకు, పాపకు సారీ చెబుతున్నాను.. పాపను జాగ్రత్తగా చూసుకో” అని రాసినట్లు తెలిసింది.
బెట్టింగ్ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడటం వల్ల ఆర్థిక నష్టాలు, అప్పుల భారం పెరిగి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. యువత బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మీయులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.