బెట్టింగ్ యాప్‌ల వ్యసనానికి యువకుడు బలి.. అప్పుల బాధతో ఆత్మహత్య

ప్రజాసంక్షేమం న్యూస్|భువనగిరి: బెట్టింగ్ యాప్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయిన ఓ యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది.బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోయి అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న యువకుడు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. మృతికి ముందు తన భార్యకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. “నన్ను క్షమించు.. ఎన్నిసార్లు మారాలనుకున్నా మారలేకపోయాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం” అంటూ తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేసినట్లు సమాచారం.అలాగే భార్య, కుమార్తెకు క్షమాపణలు చెబుతూ.....