PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:04 pm Posted by : Praja Sankshemam News

బొల్లేపల్లిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

**బొల్లేపల్లి, అక్టోబర్ 15:** ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బొల్లేపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాజిదా బేగం, మాజీ జెడ్పీటీసీ సందెల సుధాకర్, గ్రామ మాజీ సర్పంచ్ గోదా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే వార్డు సభ్యులు కనకుంట్ల పాండు, మట్ట శ్రీనివాస్, సందెల మహేష్, గొర్ల బాలరాజు, వడిచర్ల కీర్తన, పీన్నప్పురాల గంగాధర్, సరికొండ లింగమ్మతో పాటు గ్రామ పెద్దలు నానంచర్ల బిక్షపతి, నాంపల్లి మల్లేష్, పన్నీరు యాదగిరి, గాదె జయేందర్, కంసాని భాస్కర్, ఎండీ ఫకీర్, బొల్లేపల్లి అశోక్, ఎర్రవల్ల యాదయ్య, రావులపల్లి నరసింహ, కొంతం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు హాజరయ్యారు.

PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్