మర్రిగూడలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మర్రిగూడ, అక్టోబర్ 31 (ప్రజా సంక్షేమం న్యూస్): మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ...