మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారతపై కీలక చర్చలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నేరెళ్ల శారదకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సాధికారత కోసం మహిళా కమిషన్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు స్నేహపూర్వకంగా చర్చించారు.మహిళలకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ నేరెళ్ల శారదకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారూ…