PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 3:47 pm Posted by : Praja Sankshemam News

మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు!

**ప్రశ్నలను అణచివేయడం కాదు.. సమాధానాలు చెప్పడమే ప్రజాస్వామ్య బలం: మంత్రి సీతక్క**
ప్రజాసంక్షేమం న్యూస్**హైదరాబాద్:**
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని, మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛ, భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, మహిళా జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లు, వేధింపులు లేకుండా తమ విధులను నిర్వర్తించే పరిస్థితులు ఉండాలని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా అంశంపై నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు స్థానం ఉండాలని, ప్రశ్నలను అణచివేయడం ద్వారా కాకుండా వాటికి సమాధానాలు చెప్పడం ద్వారానే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు.మహిళల స్వేచ్ఛ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.