మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు!
**ప్రశ్నలను అణచివేయడం కాదు.. సమాధానాలు చెప్పడమే ప్రజాస్వామ్య బలం: మంత్రి సీతక్క** ప్రజాసంక్షేమం న్యూస్**హైదరాబాద్:** పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని, మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛ, భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, మహిళా జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లు,...