PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 12:32 pm Posted by : Praja Sankshemam News

మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత..

మహిళా,శిశు సంక్షేమం,విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత:మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్:రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,CWC సభ్యులు దామోదర్ రాజనర్సింహను AICC సెక్రటరీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఎం.ఎస్. మయూరి సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో మహిళా సాధికారత, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, శిశువుల సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే మహిళా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం,మహిళా కాంగ్రెస్‌ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.