మియాపూర్‌లో 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూ.50 వేల కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వ హక్కులకు స్పష్టత – తెలంగాణ ప్రజల విజయమన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా సంక్షేమం న్యూస్ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాల బారిన పడకుండా కాపాడుకునేందుకు అనుకూలంగా తీర్పు వెలువడటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు...