రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలపై టీడీపీ నేతల ఆందోళన
వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో లేవని ఆరోపణ ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్పత్రిని పరిశీలించారు. సామాన్య ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.టీడీపీ మండల ఇంచార్జ్ మీర్జా పజిల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహణ కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల నాయకులు బత్తుల సత్యం, వడ్లకొండ సత్తయ్య ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.ఆస్పత్రిలో సుమారు 20 రోజులుగా...