PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 11:47 am Posted by : Praja Sankshemam News

రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలి

**ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం**
**హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:**

ఎల్‌నినో ప్రభావంతో ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.ప్రజాభవన్ నుంచి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్ అంచనాలు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు.వ్యవసాయం, గృహావసరాలు, పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు తగినంతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అవసరమైతే కోల్ ఇండియా నుంచి అదనపు బొగ్గు కొనుగోలుకు ప్రభుత్వం నిధుల కొరత లేకుండా పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.