రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC సూపర్‌వైజర్
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:జీహెచ్‌ఎంసీ మెహదీపట్నం సర్కిల్-33 టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.భవన నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఉండేందుకు రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.సునీత వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.4 లక్షలతో పాటు అదనంగా రూ.2.5 లక్షల అక్రమ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని ఏసీబీ ప్రత్యేక...