రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం
**వట్టిమర్తిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం** ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల: రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి, వారికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కేంద్రానికి...