రైళ్ల కేటాయింపుపై కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ మెరుపు ధర్నా!

ఢిల్లీ నిరసనకు రైళ్లు కేటాయించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపణ ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి రైళ్లు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రైల్వే నిలయం వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు.ఈ నిరసనలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ,...