రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ షానవాజ్ ఖాసీం చిట్యాల, ప్రజా సంక్షేమం న్యూస్: యాదాద్రి జోన్ ఐజీ షానవాజ్ ఖాసీం, ఐపీఎస్‌ చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ తనిఖీలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్‌ పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేలపై పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని...