వెలిమినేడు సబ్స్టేషన్ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు
ప్రజా సంక్షేమం న్యూస్ చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. గ్రామ పరిధిలో నెలకొన్న లోఓల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, రైతులకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.లోఓల్టేజ్ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు, ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే **చిరుమర్తి లింగయ్య** మాట్లాడుతూ, రైతుల విద్యుత్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.