PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 7:23 pm Posted by : Praja Sankshemam News

విద్యారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట – మంత్రి పొన్నం ప్రభాకర్

జగిత్యాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌ భవనాలకు శంకుస్థాపన!
ప్రజాసంక్షేమం న్యూస్ జగిత్యాల:

రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని తాటిపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవనాలకు సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.ప్రతి విద్యార్థికి సమాన విద్యావకాశాలు కల్పించడం, ఆధునిక వసతులతో కూడిన విద్యను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసేలా సమగ్ర విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, లైబ్రరీ చైర్మన్ దినేష్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నరూ