విద్యుత్ కోతలపై రైతులతో కలిసి చిరుమర్తి లింగయ్య ధర్నా
ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామంలో విద్యుత్, సాగునీటి సరఫరా సక్రమంగా లేక ఎండిపోతున్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆయన విమర్శించారు. విద్యుత్ కోతలతో పంటలకు...