PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 11:46 pm Posted by : Praja Sankshemam News

వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

ప్రజాసంక్షేమం న్యూస్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, వివిధ శాఖల అధికారులతో ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు.ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పూర్తైన పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం, శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.