PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 11:03 am Posted by : Praja Sankshemam News

శ్రీకాకుళానికి NALCO స్మెల్టర్ ప్లాంట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కీలక చర్చలు

🔹 మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయంతో శ్రీకాకుళం అనుకూల ప్రాంతం
🔹 స్థానిక యువత నైపుణ్యం, ప్రతిభ ప్రాజెక్టుకు అదనపు బలం
🔹 ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: శ్రీకాకుళం జిల్లాలో NALCO స్మెల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిని కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను వివరించారు.శ్రీకాకుళం జిల్లాలో NALCO స్మెల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఉన్న బలమైన రహదారి, రైల్వే కనెక్టివిటీతో పాటు సమీపంలో అభివృద్ధి చెందుతున్న మూలపేట పోర్టు, ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాజెక్టు వంటి మౌలిక వసతులు ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటాయని వివరించారు.అదేవిధంగా శ్రీకాకుళం ప్రజల్లో ఉన్న కష్టపడే స్వభావం, నైపుణ్యం, ప్రతిభ కూడా భారీ పారిశ్రామిక ప్రాజెక్టు ఏర్పాటుకు అదనపు బలంగా నిలుస్తాయని తెలిపారు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.NALCO స్మెల్టర్ ప్లాంట్ ఏర్పాటైతే శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.