శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో జగన్మాత దర్శనం.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో భవానీ స్వాములకు మహా భిక్షాంబర సమర్పణ

నీర్నేముల, అక్టోబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నేముల గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో భవానీ మాలధారులకు మహా భిక్షాంబర సమర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం చదువుల తల్లి, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు,...