సదాశివపేటలో గ్యాస్ ఏజెన్సీ దందా: డెలివరీ ఛార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లు
ప్రజాసంక్షేమం న్యూస్ సదాశివపేట: సదాశివపేట మండల పరిధిలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. పట్టణంలో నిర్వహిస్తున్న ‘హేమా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ’ డెలివరీ బాయ్స్ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి అదనపు నగదు వసూలు చేస్తుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం వినియోగదారులు చెల్లించే సిలిండర్ బిల్లు మొత్తంలోనే హోమ్ డెలివరీ ఛార్జీలు కలిసి ఉంటాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రం...