సింగీతం శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

వైవిధ్యభరిత చిత్రాలతో ప్రత్యేక ముద్ర తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడు కుటుంబ సభ్యులు, అభిమానులకు సీఎం ప్రగాఢ సానుభూతి హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమతో పాటు భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.వైవిధ్యమైన కథాంశాలు, వినూత్న ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు సేవలను...