హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నీర్నేములలో అంగరంగ వైభవంగా దుర్గా మాత శోభాయాత్ర

భజనలతో మార్మోగిన గ్రామ వీధులు.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామ ప్రజలు నీర్నేముల: దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నీర్నేముల గ్రామంలో నిర్వహించిన అమ్మవారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజన కార్యక్రమాలు, అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో గ్రామ వీధులు మార్మోగాయి. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం శోభాయాత్ర చేపట్టారు. భజనల...