2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీల భర్తీ: సీఎం
విడతలవారీగా నియామకాలు.. పోలీసు సంక్షేమానికి పెద్దపీట:సీఎం రేవంత్ రెడ్డి **హైదరాబాద్, అక్టోబర్ 21 (ప్రజా సంక్షేమం న్యూస్):** తెలంగాణ పోలీసు శాఖలో సిబ్బంది కొరత లేకుండా 2028 నాటికి అన్ని ఖాళీలను విడతలవారీగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆహార కల్తీ వంటి నూతన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో...