అచ్చంపేట సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి, విప్ వేముల వీరేశం
సభా వేదిక, పార్కింగ్, భద్రత, ప్రజా సౌకర్యాలపై అధికారులతో సమీక్ష ప్రజాసంక్షేమం న్యూస్ అచ్చంపేట:ఈ నెల 26న అచ్చంపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్ల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల ఇన్చార్జీలతో కలిసి సభా వేదిక, పార్కింగ్ స్థలాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను...