ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. మరో కారును ఢీకొని బీభత్సం
ప్రజాసంక్షేమం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా:మోత్కూరు మండలం అనాజీపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ అదే వేగంతో ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారులో ఉన్న చిన్నారి మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.