అమ్మ ఒడి.. ఉద్యమ బడి!
మూడు నెలల పసికందుతో ఏఐకేఎస్ జాతీయ మహాసభలకు హాజరైన ఝార్ఖండ్ మహిళా ఉద్యమకారిణి మీలా కుమారీ మాతృత్వం, ఉద్యమ నిబద్ధతను సమన్వయం చేస్తూ మహిళాలోకానికి ఆదర్శం నల్లగొండ, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్): ఒక చేత్తో పసికందును అక్కున చేర్చుకుంటూ.. మరో చేత్తో ఎర్రజెండా ఆశయాలను ఎత్తిపట్టిన మహిళా ఉద్యమకారిణి మీలా కుమారి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మాతృత్వం ఉద్యమాలకు అడ్డంకి కాదని, కుటుంబ బాధ్యతలు ఆశయ సాధనకు సంకెళ్లు కావని తన ఆచరణతో నిరూపిస్తున్నారు.నల్లగొండ వేదికగా నవంబర్ 15 నుంచి 18 వరకు...