ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

నకిరేకల్, నవంబర్ 08 (ప్రజా సంక్షేమం న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జాయింట్ కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డితో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.