ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం: పున్న కైలాష్ నేత

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కరపత్రం ఆవిష్కరణ నల్లగొండ, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్): భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ...