ఈత చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

కాలు, వెన్నుపూస విరిగి ఆసుపత్రిలో చికిత్స.. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మునుగోడు,నవంబర్ 25(ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి): మునుగోడు మండలం చోల్లేడు గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొడ్డు నరసింహ (45) ఈత చెట్టు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నవంబర్ 23న సాయంత్రం 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.రోజువారీ పనిలో భాగంగా కల్లు తీసేందుకు ముస్తాదు మోకు సహాయంతో ఈత చెట్టు ఎక్కిన నరసింహ ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు, వెన్నుపూస...