ఉరుమడ్లలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఉరుమడ్ల, నవంబర్ 08 (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉరుమడ్ల గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల...